Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
''చేరవైన, దూరమైన'' చలనచిత్రం దేశం మొత్తం 200 థియేటర్లలో విడుదలైన సందర్భంగా, చిత్రంలోని వర్ధమాన హీరో సుజిత్ రెడ్డి స్వస్థలమైన కల్లూరు మండలం, కప్పలబందం గ్రామంలో హీరో కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామస్తుల సమక్షంలో కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హీరో అజిత్ రెడ్డి బాబాయిలు కర్నాటి జయబాబు రెడ్డి, అశోక్ రెడ్డిలు, వారి మిత్రులైన కల్లూరు ఎంపీడీఓ టి. శ్రీనివాసరావు మరియు పలువురు మిత్రులు మాట్లాడుతూ మన ప్రాంతం నుంచి చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, హీరోగా తెరగేంట్రం చేసిన సుజిత్ రెడ్డి, హీరొయిన్ తరుణి సింగ్ లను ఆశీర్వదించి ఆదరించాలని కోరారు.
మన ప్రాంతానికి చెందిన కర్నాటి వెంకటరెడ్డి(సినర్జీ ఆగ్రోస్ కంపెనీ అధినేత) కుమారుడు సుజిత్ రెడ్డిని హీరోగా తెరపై చూడనుండటం ఎంతో సంతోషంగా ఉందని, మిత్రులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, సర్పంచ్ నందిగం ప్రసాద్, ఎఎంసి వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, జడ్పీ, మండల కో ఆప్షన్ సభ్యులు యండి ఇస్మాయిల్, . కమ్లి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, ఎంపీటీసీ లక్కిరెడ్డి గోపిరెడ్డి, నాయకులు ఉబ్బన వెంకటరత్నం, ఎంపీటీసీ జిల్లెళ్ళ కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.