Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాధపాలెం
రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలను అన్నింటింని వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని తదితర డిమాండ్స్ తో ఎస్ఎఫ్ఐ, డీవైయఫ్.ఐ ఆధ్వర్యంలో తలపెట్టిన ఛలో హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జరపకుండా ప్రభుత్వం, కేసీఆర్ ఎన్ని కుట్రలు, పోలీసులతో అక్రమంగా అన్ని జిల్లాలలో రాత్రికి రాత్రే ముందస్తుగా అక్రమంగా అరెస్టులు చేసిన ప్రగతి భవన్ ని వందలాది కార్యకర్తలు ముట్టడించి విజయవంతం చేశారని డివైఎఫ్ఐ రాష్ట్రకమిటీ సభ్యులు చింతల రమేష్ తెలిపారు. ఇప్పటికైన కేసీఆర్ స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తిరిగిన అడ్డుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తూ డి.వై.యఫ్ఐ, యస్యఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక మండల కేంద్రంలో ఆందోళన, నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు షేక్. షరీఫ్, మండల నాయకులు అబ్దుల్, దొంతూ. గణేష్, తెల్లబోయిన.నరేష్, పాల్గొన్నారు.