Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. ఇమ్మడి తిరుపతిరావు ఇంటి ముందు నిలిపి ఉంచిన కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. ఆ సమయంలో తిరుపతిరావు ఇంట్లో నిద్రిస్తున్నాడు. కారు అద్దాలను ధ్వంసం చేస్తున్న సమయంలో శబ్దంతో తిరుపతిరావు కుటుంబ సభ్యులు బయటకు రావటంతో దుండగులు పరారైనారు. దీనికి సంబంధించి పోలీసులకు పిర్యాదు చేశారు.
నిందితులను గుర్తించి శిక్షించాలి
టీఆర్ఎస్ నేత ఇమ్మడి తిరుపతిరావు కారును ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు అజ్మీర నరేష్ పోలీసులను కోరారు. సోమవారం తిరుపతిరావును పరామర్శించి ధైర్యం చెప్పారు. రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని వారు దాడులకు తెగబడుతున్నారని ఇది సహించరానిదన్నారు. టీఆర్ఎస్ నేతను పరామర్శించిన వారిలో మండల కోఆప్షన్ ఎండీ.హనీఫ్, టీఆర్ఎస్ యువజన నాయకులు మజీద్పాష, ఆదెర్ల ఉపేందర్, తొగరు శ్రీను తదితరులు ఉన్నారు.