Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానంలో పదవ తరగతి, ఇంటర్ లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోనకల్లు మండలంలో తూటికుంట్ల గ్రామంలో గల చైతన్య విద్యాలయం కరస్పాండెంట్ షేక్ హుస్సేన్ సోమవారం విలేకరులకు తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 10 వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెగ్యులర్గా, పాఠశాల మధ్యలో బడి మానేసిన వారు, పని చేసుకుంటూ చదువుకునే వారు, గృహిణిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమాచారం కొరకు చైతన్య విద్యాలయం కరస్పాండెంట్ షేక్ హుస్సేన్ 9866153580, 9515714676 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.