Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కామేపల్లి
కరోనా వ్యాధి నివారణకు టీకాతోనే శ్రేయస్కరమని మండల ఎంపీడీవో సిలార్ సహెబ్ అన్నారు. మండల పరిధిలోని సాతాని గూడెం గ్రామంలో టీకా కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలన్నారు. టీకా తీసుకోవటం వల్ల ఎంతో ఉపయోగం ఉందన్నారు. ప్రజలు గ్రామంలో ఏర్పాటు చేసిన టీకా సెంటర్ వద్దకు వెళ్లి టీకా వేయించుకొని సంపూర్ణ ఆరోగ్యం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ రావత్ నాగమణి, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, హెచ్ వీ జ్యోతి, ఏఎన్ఎం రేణుకారాణి, సిబ్బంది, ఆశాకార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
నవతెలంగాణ-ముదిగొండ
మండల పరిధిలో గంధసిరి మున్నేరు నుండి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 5 ట్రాక్టర్లను సోమవారం ఎస్సై తాండ్ర నరేష్ పట్టుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇసుక ట్రాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.