Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రాములు నాయక్
నవతెలంగాణ-కొణిజర్ల
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవకుడిగా పనిచేస్తానని ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ అన్నారు. మండల పరిధిలోని బస్వపురం గ్రామంలోని కస్తూరిబా బాలికల జూనియర్ కళాశాలలలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజురైన చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు సోమవారం ఆయన చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ లో సైతం వైద్యం చేసుకున్నట్లయితే వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తుచేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా16 లబ్ధిదారులకు 2,87,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గుమ్మా రోశయ్య కొణిజర్ల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు యాండ్రా ప్రగడ చిరంజీవి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు దొడ్డపనేని రామారావు, మండల పరిషత్ కోఆప్షన్ ఎస్.కె మౌలానా, సుడా డైరెక్టర్ బండారు కృష్ణ, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కోసూరి శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య, లింగ గూడెం సర్పంచ్ దొండపాటి లక్ష్మి, ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు బురా ప్రసాద్, పోగుల శ్రీను, రచ్చ రామ కోటయ్య, జిడయ్యా, గోపారం సర్పంచి అద్దంకి చిరంజీవి, బొడియా తండా సర్పంచ్ బాలాజీ, చిన్న పుల్లయ్య, బాబూలాల్, ఏనుగంటి కృష్ణ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు