Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్ స్పష్టం
నవతెలంగాణ-కొత్తగూడెం
భూమి సమస్యలు పరిష్కారానికి ధరణి పోర్టల్లో ధరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ నందు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు. తక్షణ పరిష్కారం నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్య పరిష్కరించాలని ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన వినతులను ఆయా శాఖల అధికారులు పరిష్కరించుటలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ ఉంచడానికి వీల్లేదన్నారు. ఈ నెలాఖరు వరకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్జీఓకు సూచించారు. కొత్తగూడెం పట్టణంలో గుర్తించిన ప్రభుత్వ భూములు పరిరక్షణకు స్థలం చుట్టు ఫెన్సింగ్ ప్రక్రియను చేపట్టాలని తహసిల్దార్లను ఆదేశించారు. ఐరిష్ రాని వ్యక్తులకు సెల్ఫోను వచ్చే ఓటిపీని పరిగణలోకి తీసుకుని బియ్యం పంపిణీ చేయాలన్నారు.