Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 84 పోస్టులకు 11,133 మంది పోటీ
అ పరీక్షకు హాజరుకానున్న 10,415 మంది
మహిళా అభ్యర్థులు, 718 పురుషులు
అ కొత్తగూడెం, పాల్వంచలోని
18 కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు
అ సింగరేణి డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్)
ఎన్.బలరామ్
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో స్టాఫ్ నర్సు ఖాళీల భర్తీకి ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తున్న పరీక్షకు పోటీ నెలకొంది. 84 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా, 13379 మంది అభ్యర్థుల నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి 2246 వివిధ కారణాల రిత్యా అర్హతలు లేని కారణంగా అనర్హులుగా ప్రకటించారు.11133 మందికి హాల్ టికెట్లు జారీ చేశారు. ఇందులో 10,415 మంది మహిళా అభ్య ర్థులు కాగా, సంస్థలో తొలిసారిగా 718 మంది పురుషులు కూడా పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్ష నిర్వహణకు కొత్తగూడెం, పాల్వ ంచలోని 18 పరీక్షా కేంద్రాలలోఏర్పాట్లు చేశారు. తమకు కూడా పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలం టూ కొందరు పురుష అభ్యర్థులు హైకోర్టును ఆశ్ర యించడం, న్యాయస్థానం సానుకూలంగా స్పందించ డంతో పురుషులు సైతం స్టాఫ్ నర్సు పరీక్ష రాసేం దుకు యాజమాన్యం అనుమతి ఇచ్చింది. దీంతో 718 మంది పురుషులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
దళారులను నమ్మవద్దు....
సింగరేణిలో పరీక్ష నిర్వహణ విధానంపై అవగాహన లేక పలువురు అభ్యర్థులు మోసకారుల మాటలను నమ్మి నష్ట పోతున్నారని డైరెక్టర్ పర్సనల్, ఫైనాన్స్ ఎన్.బలరామ్ చెప్పారు. అభ్యర్థులు తమ శ క్తి సామర్థ్యాలు, ప్రతిభను నమ్ముకొని పరీక్ష రాయా లని, మోసకారుల మాటలు నమ్మి వంచనకు గురి కావొద్దని కోరారు. సింగరేణిలో పూర్తి పారదర్శకంగా పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.