Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పీఆర్సీ అమలు చేయాలి
అ కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆషా కార్మికులకు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆషా వర్కర్స్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. సోమవారం కలెక్టట్లో వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ట్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సదర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవి.అప్పారావు మాట్లాడారు. ఆషా కార్మికులు వారు చేయాల్సిన పనులతో పాటు కరోనా నియంత్రణలో తమ, తమ కుటుంబాల ఆరోగ్యాలను ఫణంగా పెట్టి విధులను నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు వీరి సమస్యలను పరిష్క రించడంలో నిర్లక్ష్యం వహిసు ్తన్నారని తెలిపారు. ఏపీలో సర్కార్ ఆషాలకు ఫిక్సిడ్గా రూ.10వేలు వేతనం నిర్ణయించి అమలు చేస్తున్నారని తెలిపారు. తెలం గాణ ప్రభుత్వం మాత్రం అమలు చేయడంలేదన్నారు. ప్రభు త్వం ఆషా, అంగన్వాడీ తదితర స్కీమ్ వర్కర్లకు పీఆర్సీ 30 శాతం అమలు చేస్తుమని చెప్పి, అంగన్వాడీ వారికి అమ లుకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆషాల విషయం మరిచారని వాపోయారు. కరోనా విధులు నిర్వహిస్తు మృతి చెందిన ఆషాలకు రూ.50 లక్షల బీమా అమలు చేయాలని, ఏఎన్ ఎంల నియామకాలలో ఆషాలకు వెయిటేజీ ఇచ్చి నియ మించాలని, చేసిన ప్రతి పనికి పారితోషికం ఇవ్వాలన్నారు. ''జాబుచార్టు'' ఏర్పాటు చేసి అమలు చేయాలన్నారు. కమిషన్ ఇచ్చిన హామీ మేరకు 'రిజిస్టర్లు', 'స్మార్ట్ ఫోన్లు' ఇవ్వాలని, బాకాయి వున్న 4 జతల చీరలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికారుల, ప్రజాప్రతి నిధుల వేధింపులు నిలుపు చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో ఆషాల సంఘం జిల్లా అధ్యక్షురాలు పి. ఝాన్సీ, ఆషా రంగం నాయకులు యశోద, నాగమణి, పద్మ, అన్నపూర్ణ, స్వరూప, వెంకటరమణ పాల్గొన్నారు.