Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని
నవతెలంగాణ-పాల్వంచ రూరల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విపరీతమైన డెంగ్యూ మలేరియా, టైఫాయిడ్ కేసులు ఉన్నాయని ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి వెంటనే జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య డిమాండ్ చేశారు. సోమవారం పాల్వంచ మండల పరిధిలోని బండ్రు గొండ గ్రామపంచాయతీలో పార్టీ శాఖ మహాసభ నిర్వహించారు. మహాసభ ప్రారంభ సూచికగా పతా కావిష్కరణ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి పట్టించు కోవడంలో విఫలమైందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలలో మెడికల్ క్యాంపులో నిర్వహించే ప్రజల ఆరోగ్యంపై తగిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంత రం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడు తూ పోడు భూములపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోడు భూముల జోలికి వెళ్లవద్దని ప్రకటనలు చేయిస్తూనే మరోవైపు ఫారెస్ట్ అధికారు లను పోడు సాగు దారుల భూములను బలవం తంగా లాక్కుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, పోడు సాగు దారులకు పట్టాలు మంజూరు చేయాలని లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ మహాసభలో పా ర్టీ మండల కమిటీ సభ్యులు పాకలపాటి వెంక టావు సీనియర్ నాయకులు సత్యం, రామదాసు ,ఖాజా, ఉపసర్పంచ్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.