Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి నీలిమా
నవతెలంగాణ-కొత్తగూడెం
బాలలపై అగాయిత్యాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని కొత్తగూడెం కోర్టు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముద్దసాని నీలిమా అన్నారు. సోమవారం కొత్తగూడెం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మిదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామంలో బాలల హక్కులు, చట్టాలు అనే అంశంపై నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో న్యాయమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండని బాల బాలికలతో నేరాలు చేయించడం, వారిపై అగాయిత్యాలు చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం అని నీలిమా తెలిపారు. ఇలాంటి వారిపై నేరం రుజువు అయితే 10 సంవత్సరాల నుండి జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంటుందన్నారు.
ఈ కార్య క్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ ట్రెజరర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ యండి.సాదిక్ పాషా, సినియర్ న్యాయవాదులు వెలగల నాగిరెడ్డి, కటకం పుల్లయ్య, సుర్య ప్రకాష్ రావు, మెండు రాజమల్లు, లక్ష్మిదేవి పల్లి మండల సబ్ ఇన్ స్పెక్టర్ అంజయ్య, ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, సర్పంచ్, ఎంపీటీసీ పాల్గొన్నారు.