Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తక్షణమే విచారణ చేపట్టాలి
అ బీటీపీఎస్ ఆదివాసీ ఉద్యోగ సమన్వయ కమిటీ అధ్యక్షులు శివ
నవతెలంగాణ-పినపాక
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో భూములు కోల్పోయి, ఉద్యోగ ఆప్షన్ ఎంచుకున్న పినపాక, మణుగూరు మండలాలకు చెందిన ఆదివాసి గిరిజన భూనిర్వాసితలకు అన్యాయం జరిగిందని బీటీపీఎస్ ఆదివాసీ ఉద్యోగ సమన్వయ కమిటీ అధ్యక్షులు సనప శివ ఆరోపించారు. పెసా గ్రామ సభలల్లో గిరిజనులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని అందరికీ ఒకే స్థాయి కలిగి జేపీఏ ఉద్యోగాలు కల్పిస్తామని ''పెసా గ్రామసభల్లో కలెక్టర్, ఐటీడీఏ పీవో, జెన్కో అధికారులు చెప్పారని, కాని ఇప్పుడు జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎస్టీ కోయ గిరిజనులకు అన్యాయం జరిగిందని అన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నందు నియమించిన ఉద్యోగుల్లో నిజమెమైన
భూనిర్వాసితులైన 46 మందిని నియమించకుండా, చాలామందికి అక్కడ ఎటువంటి భూములు కోల్పోని వారికి ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. అధికారులు విచారించి అసలైన భూనిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్, పీవోలకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.