Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ఏరియా ఆస్పత్రిని భద్రాచలం శాసన సభ్యులు, ఏరియా ఆసుపత్రి చైర్మన్ పొదెం వీరయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన పేషెంట్ల సంఖ్య, ప్రస్తుతం సీజనల్గా వ్యాప్తి చెందుతున్న డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలపై తీసుకుంటున్న జాగ్రత్తలు, అడ్మిట్ అయిన పేషెంట్లకు తీసుకున్న వైద్యంపై మందులు లభ్యత, సిబ్బంది పని విధానాలు క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆస్పత్రిలోని కొవిడ్ వార్డుని కూడా స్వయంగా సందర్శించి పేషెంట్లకు అందిస్తున్న వైద్యం గురించి పేషంట్లను, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లకు ఇస్తున్న భోజనం, టిఫిన్, పాలు వంటి అని పౌష్టికాహారం గురించి కూడా తెలుసుకున్నారు. అదే విధంగా శిథిలావస్థకు చేరుకుంటున్న భద్రాచలం ఏరియా ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్, పాత ఆస్పత్రి లోని వివిధ గదులను అన్నింటిని స్వయంగా తిరిగి వాటి పరిస్థితిపై సమీక్షించారు. వెంటనే ఇంజనీరింగ్ శాఖ అధికారులను తగు సమాచారంతో రమ్మని ప్రభుత్వానికి సమర్పించడానికి వాటికి అయ్యే ఖర్చు నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. ఆసుపత్రి డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది సమయపాలన పాటిస్తూ వ్యాధిగ్రస్తులకు నిత్యం అందుబాటులో ఉండాలని డాక్టర్లతో జరిగిన సమావేశంలో ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ యం.రామకృష్ణ, వైద్యులు పాల్గొన్నారు.