Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మీగడిశీనివాస్ యాదవ్
నవతెలంగాణ-ముదిగొండ
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే దళిత బంధు పథకాన్ని ప్రతిపక్ష పార్టీలు హేళన చేస్తే సహించేది లేదని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మీగడ శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సోమవారం ముదిగొండలోని పార్టీ మండల నాయకులు మందరపు ఎర్ర వెంకన్న గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, దళిత బంధు లాంటి ఆలోచనలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నూటికి నూరు శాతం అమలు చేయడానికి పూనుకున్నారని ఈ పథకాన్ని అభినందించాల్సిన వారు హేళన చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. దళిత బంధు పథకం పై హేళన చేస్తూ విమర్శలు చేస్తే కాంగ్రెస్ అగ్ర నాయకులు పైసైతం ఎస్సీ ఎస్టీ కేసు నమోదుకు వెనకాడని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్, మండల రైతు బంధు కన్వీనర్ పోట్ల వెంకటప్రసాద్, ఏఎంసీ నేలకొండపల్లి డైరెక్టర్ బంక మల్లయ్య, నాయకులు పసుపులేటి వెంకట్, మందరపు ఎర్ర వెంకన్న, చెరుకుపల్లి బిక్షం తదితరులు పాల్గొన్నారు.