Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
గత కమిటీ పాలనలో ఇల్లందు వ్యవసాయ మార్కెట్ అస్తవ్యస్తంగా ఉమ్మడి జిల్లాలో ఉత్తమ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. మార్కెట్ యార్డ్‌లో సోమవారం మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు హరి సింగ్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశం జరిగింది. తొలుత మార్కెట్ ఆవరణలోని మైసమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే హరిప్రియ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్ యార్డ్‌కు కోల్డ్ స్టోరేజ్, హౌల్ సేల్ మార్కెట్ ఏర్పాటుకు ఇటీవలే వ్యవసాయ శాఖ మంత్రికి వినతిపత్రం అందించగా మంత్రి సానుకూలంగా స్పందించారని త్వరలో నిర్మాణాలు జరగనున్నాయని తెలిపారు. నియోజకవర్గ అభ్యున్నతే తన లక్ష్యమని అన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగ్ నాయక్ మాట్లాడుతూ అందరి సహకారంతో మార్కెట్ అభివృద్ధికి పాటుపడదామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జానీ పాషా, మునిసిపల్ కమిషనర్ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణకుమారి, వ్యవసాయ శాఖ ఏడి వాసవి రాణి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లాల్ సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పులిగండ్ల మాధవరావు, మార్కెట్ కంపెనీ డైరెక్టర్లు పాల్గొన్నారు.