Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రాజేష్
నవతెలంగాణ-నేలకొండపల్లి
కరోనా మహమ్మారి అనుమానంతో సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యం చేయించుకోవాలని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రాజేష్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలోని ఎస్సీ కాలనీలో ప్రజలు విష జ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం మేరకు కాలనీలో ఆశావర్కర్లు, తమ వైద్య సిబ్బందితో ఇంటింటి సర్వే చేపట్టారు. అనంతరం సానిక ప్రభుత్వ పాఠశాలలో హెల్త్ క్యాంపు నిర్వహించి బాధితులకు సరైన వైద్య సేవలు అందించి తగు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో జ్వరంతో బాధపడుతున్న కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆయన వెంట పిహెచ్ఎన్ దుర్గ, హెచ్ఈవో వీరన్న, ఏఎన్ఎం నాగమణి, జ్యోతి, ఆశా వర్కర్లు మరియమ్మ, సుజాత తదితరులు ఉన్నారు.