Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాధితులు పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు
నవతెలంగాణ-పాల్వంచ
జెన్కో సీఎండి ప్రభాకర్‌రావు భార్యకు దగ్గరి బందువునని చెప్పి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ కల్పించి లక్షల రూపాయలు దండుకుని ముకం చాటేసి తప్పించుకుని తిరుగుతున్న సంఘటన పాల్వంచలో జరిగింది. రెండు సంవత్సరాలు దాటినా ఉద్యోగం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన పాల్వంచ పట్టణానికి చెందిన ఇరుప లకిë కేటీపీఎస్‌లో సొసైటీ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. కేటిపిఎస్లో ఇక ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారని ఆరు నెలలో పర్మినెంట్ చేస్తామని చెప్పి ఇప్పిస్తానని నా భార్య రజినికి జెన్కో సిఎండి ప్రభాకర్‌రావు దగ్గరి బంధువు అవుతుందని చెప్పి కొత్తగూడెం బాబూక్యాంపుకు చెందిన పుచ్చకాయల సాంబశివరావు 45,40000 లక్షలు తీసుకుని మిగితా డబ్బులు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇవ్వమని చెప్పారని అన్నారు. అనంతరం 2 సంవత్సరాలు గా గడిచినా ఉద్యోగం విషయం గుర్తు చేసినప్పుడల్లా డొంకతిరుగుడు మాటలు చెబుతూ తిప్పిం చుకుని తిరుగుతుండడంతో అనుమా నం కలిగి గట్టిగా నిలదీయడంతో డబ్బులు అడిగితే చంపుతామని నీ శవం కూడా దొరకకుండా చేస్తామని బెదిరిస్తూ నోటికొచ్చిన బూతులు తిడుతుండడంతో దీంతో భయపడి పాల్వంచ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ విషయమై కోఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షు లు కాంపెల్లి కనకేష్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న ఈ వ్యక్తిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని బాదితులకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.