Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ సహకారంతో పాఠశాల
ఆవరణను పరిశుభ్రంగా చేయించాలి
- విద్యార్థులు కోవిడ్ నిబంధనలు
పాటించాలి
- జిల్లా విద్యాధికారి ఇ.సోమశేఖరశర్మ
నవతెలంగాణ-కొత్తగూడెం
పండగ వాతావరణంలో పాఠశాలలు ప్రారంభించాలని జిల్లా విద్యాధికారి ఇ.సోమశేఖరశర్మ అన్నారు. సెప్టెంబర్ 1న పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్న సందర్భంగా బుధవారం మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులను ఉద్దేశించి జూమ్ సమావేశంలో జిల్లా విద్యాధికారి సోమశేఖర శర్మ మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తారీకు నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్న సందర్భంగా, పాఠశాలలో తోరణాలు, రంగు కాగితాలు, మావిడాకులతో అలంకరించి విద్యార్థులకు పాఠశాల పట్ల ఆసక్తి కలిగించేలా పండగ వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు. ముందుగా ప్రధానోపాధ్యాయులు, పాఠశాలలోని విద్యార్థులకు కావాల్సిన ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితులను కల్పించాలని అన్నారు. రేపటి నుండి పాఠశాలల్లో ఉపాధ్యాయులు 100 శాతం హాజరు కావాలన్నారు. ఈ నెల 26 నుండి నుండి 31 వరకు గ్రామ పంచాయతీ వారి సహకారంతో పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా చేయడం, త్రాగు నీటి వసతి కల్పన, మరుగుదొడ్లను శుభ్రం చేయించడం, తరగతి గదులను శుభ్రం చేయించడం, విద్యుత్ పునరుద్ధరణ. వంటి కార్యక్రమాలను నిర్వహించుకోవాలని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులు చీపురులు పట్టుకొని పాఠశాలలను శుభ్రం చేసే పనులు చేయవద్దని హెచ్చరించారు. పూర్తిస్థాయిలో స్థాయి శానిటేషన్ అయిన తర్వాత, ప్రధానోపాధ్యాయుల పాఠశాల స్థితిని తెలియజేస్తూ సర్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. సెప్టెంబర్ 1 నుండి మధ్యాహ్న భోజనం కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి, ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు అవసరమైన బియ్యం వివరాలను సివిల్ సప్లై వారికి అందించి, సంబంధిత బియ్యాన్ని పాఠశాలకు వచ్చేటట్లుగా చూసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించాలన్నారు. ఈ జూమ్ సమావేశంలో డీసిఇబి కార్యదర్శి మాధవరావు, అసిస్టెంట్ కమిషనర్ (ఎగ్జామినేషన్) రమేశ్వరరావు, జిల్లా కో-ఆర్డినేటర్లు ఏ.నాగరాజ శేఖర్, ఎస్కె.సైదులు, జె.అన్నామని,ఎన్.సతీష్ కుమార్, ఏపిఓ కె.కిరణ్ కుమార్, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.