Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి
పాల్వంచ : పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు పున:ప్రారంభం సందర్బంగా పాల్వంచలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు సిహెచ్ బుచ్చిరాములు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు కూడా సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలతో సమావేశం ఏర్పాటు చేసుకుని వారికి అన్ని సూచనలు చేయాలని పాఠశాలలో కరెంటు సౌకర్యాన్ని వెంటనే తీసుకోవాలని మౌలిక సదుపాయాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించి గిరిదర్శిని పుస్తకాలు రాయించాలని అలాగే పాఠశాలలో కోవిడ్ నిబంధనలు పాటించాలని శానిటైజ్ మాస్కులను ఏర్పాటు చేయాలని ప్రతీ నెల 5వ తేదీ .ఇపిఎస్ టీచర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎటిడిఓ చంద్రమోహన్, ఎసిఎంఓ బిబావ్సింగ్, తదితరులు పాల్గొన్నారు.