Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎల్ఐసీ డివిజనల్ మేనేజర్ ఎస్.థామస్.
నవతెలంగాణ-కారేపల్లి
బీమా గ్రామ పధకంలో గ్రామాల అభివృద్ధికి ఎల్ఐసీ నిధులు అందిస్తుందని ఎల్ఐసీ వరంగల్ డివిజనల్ సీనియర్ మేనేజర్ ఎస్.థామస్ అన్నారు. వరంగల్ డివిజనల్ పరిధిలో భీమా పాలసీ అమ్మకాల్లో ప్రతిభ చూపిన ఏజెంట్ సురేందర్‌రెడ్డి ని ఆయన బుధవారం కారేపల్లిలో సన్మానించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి మండలంలోని కారేపల్లి, పేరుపల్లి, మాదారం గ్రామాలు బీమా గ్రామాలుగా ఎంపిక అయ్యాయని తెలిపారు. కారేపల్లికి చెందిన సీనియర్ ఏజెంట్ ఇందుర్తి సురేందర్‌రెడ్డి కషితో ఈ మూడు గ్రామాలు భీమా గ్రామాలుగా ఎంపిక కాబడ్డాయన్నారు. బీమా గ్రామాలుగా ఎంపికైన గ్రామాలలో ప్రజల అవసరాలను తీర్చే అభివృద్ధి పనులకోసం నిధులు ఇవ్వటం జరుగుతుందన్నారు. బీమా గ్రామం పథకం కింద చెక్కులు త్వరలో ఆయా పంచాయతీలకు అందజేయటం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వరంగల్ డివిజన్ మార్కెటింగ్ మేనేజర్ వెంకటేశ్వరరావు,సేల్స్ మేనేజర్ చిరంజీవి, క్లియా మేనేజర్ రాజేష్ ఖన్నా, కొత్తగూడెం సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ఎన్ఎస్ రాజు, ఇల్లందు బ్రాంచ్ మేనేజర్ విద్యాసాగర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ జె.సతీష్, డెవలప్మెంట్ ఆఫీసర్లు సి.శ్రీనివాస్, మారుతీరాజు తదితరులు పాల్గొన్నారు.