Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మాస్టర్ డిగ్రీ అభ్యసనకు టెక్సాస్‌లోని
టెక్ యూనివర్సిటీ ఆహ్వానం
అ సన్మానించిన గురుజ్యోతి సేవా సంస్థ
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు కొనకళ్ల సుధారాణి కుమార్తె సుధీర ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో అత్యంత ప్రతిభను కనబరుస్తోంది. ఈ నేపధ్యంలో సుధీర మాస్టర్ డిగ్రీని అభ్యసించేందుకు అమెరికాలోని టెక్సాస్ టెక్ యూనివర్సిటీ వారి నుంచి ఆహ్వానం అందింది. ఫోరెన్సిక్లో మాస్టర్ డిగ్రీని పొందేందుకు అమెరికా వెళ్తున్న సుధీరను స్థానిక గురుజ్యోతి స్వచ్ఛంద సేవాసంస్థ బుధవారం ఘనంగా సన్మానించింది. ఈ సన్మాన, అభినందన సభలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతిష్టాత్మకమైన టెక్సాస్ టెక్ యూనివర్సిటీ వారు ఫోరెన్సిక్ సైన్స్‌లో మాస్టరు డిగ్రీని అందించేందుకు మనదేశం నుంచి ద్దరు విద్యార్థులను ఎంపిక చేయగా అందులో ఒకరు మన సత్తుపల్లికి చెందిన విద్యార్థిని సుధీర కావడం మనకెంతో గర్వకారణమన్నారు. వివిధ రకాలుగా ఉపయోగపడే ఈ అధ్యయనాలను సుధీర విజయవంతంగా పూర్తిచేసుకుని రావాలని ఈ సందర్భంగా మహేశ్ ఆకాంక్షించారు. గురుజ్యోతి అధ్యక్షుడు ఏఎస్ ప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాధ్యులు అయ్యదేవర శేషగిరిరావు, వ్యవస్థాపక అధ్యక్షులు చిత్తలూరి ప్రసాద్, కౌన్సిలర్లు కొత్తూరు ఉమామహేశ్వరరావు, అద్దంకి అనిల్‌కుమార్, సుభాశ్ యువజన సంఘం అధ్యక్షులు పీఎల్ ప్రసాద్, వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గంగిశెట్టి జగదీశ్, లయన్స్‌క్లబ్ జోనల్ ఛైర్మెన్ జంగా సత్యనారాయణ, గురుజ్యోతి డైరెక్టర్లు గాదిరెడ్డి సుబ్బారెడ్డి, నరసింహారావు పాల్గొన్నారు.