Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జాతీయ స్థాయిలో ఎన్.టి.ఏ. నిర్వహిచే జేఈఈ నాల్గో విడత మెయిన్స్- బి. ఆర్క్ 2021 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి ఖమ్మం జిల్లాలో ఐదు, సూర్యాపేట జిల్లా కోదాడలో ఒకటి, కష్ణా జిల్లా తిరువూరులో ఒకటి చొప్పున మొత్తం 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సిటీ కో-ఆర్డినేటర్ ఆర్. పార్వతీరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో విజయ ఇంజనీరింగ్ కాలేజి, తణికెళ్ళ, ఎస్.బి.ఐ.టి. పాకబండ బజార్, కిట్స్ కాలేజి, పొన్నెకల్, బొమ్మా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అల్లీపురం, ప్రియదర్శిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పెద్ద తండ, అలాగే సూర్యాపేట జిల్లా కోదాడలో అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజి, కష్ణాజిల్లా తిరువూరులో శ్రీ వాహిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఆగష్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీలలో కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుండి 12గంటల వరకు రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3గంటల నుండి 6 గంటల వరకు జరుగు తాయి. పరీక్ష కేంద్రానికి తప్పనిసరిగా గంట ముందుగా చేరుకోవాలి.
మొత్తం 7 పరీక్ష కేంద్రాలలో 5,702 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా 2 పాస్‌పోర్ట్ ఫొటోలు, పర్సనల్ ట్రాన్సపరెంట్ వాటర్ బాటిల్, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ (50మి.లీ), ట్రాన్సపరెంట్ పెన్, అడ్మిట్ కార్డ్, ఆధార్‌కార్డ్ / పాస్‌పోర్ట్ / రేషన్ కార్డ్ గాని ఏదైనా ప్రభు త్వ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని తీసుకుని రావాలి. పరీక్ష కేంద్రం లో మాస్క్ ఉచితంగా అందజేస్తారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
సూచనలు...
పరీక్ష కేంద్రాలను ప్రతి పరీక్షకు ముందు విధిగా శానిటైజేషన్ చేస్తారు. విద్యార్థులు తప్పని సరిగా సామాజిక దూరాన్ని పాటించాలి. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి తప్పని సరిగా అడ్మిట్ కార్డ్, పరీక్ష కేంద్రంలో ఇచ్చిన రఫ్ బుక్ లెట్‌ను డ్రాప్ బాక్స్‌లో వేయాలి. జి.ఓ.ఐ. నింబంధనలకు అనుగుణంగా ప్రతి విద్యార్థి బాధ్యతగా నడచుకోవాలి. విద్యార్ధినీ, విద్యార్థులు కోవిడ్ నేపథ్యంలో పరీక్ష హాలులోకి ఒకేసారి రాకుండా అడ్మిట్ కార్డ్‌లో పరీక్ష కేంద్రానికి చేరవలసిన సమయాన్ని సూచించారు. అదే సమయానికి తప్పనిసరిగా హాజరు కావలసి ఉంటుందని సిటీ కోఆర్డినేటర్ ఆర్. పార్వతీరెడ్డి తెలిపారు.