Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎంసెట్ మెడికల్ ఫలితాలలో ఖమ్మానికి చెందిన డాక్టర్స్ అకాడమీ ఉత్తమ ఫలితాలు సాధించినట్లు డైరెక్టర్స్ రాయల సతీష్‌బాబు, ఈగ భరణికుమార్ తెలిపారు. కళాశాలకు చెందిన షేక్ అన్సార్ 112 మార్కులతో రాష్ట్రస్థాయిలో 655వ ర్యాంక్, చందన 908, భవ్యశ్రీ 955, వైష్ణవి 987, ధరణి 994 ర్యాంకులు సాధించారని వివరించారు. ఖమ్మంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. కళాశాలకు చెందిన ఉషా 1222, నీమా 1289, వినీత 1440, షిఫా 1572, విజరు 1578, చంద్రిక 1598, శ్రియ 1614, జ్యోత్స్న 1872 ర్యాంకులు సాధించారని తెలిపారు. రెండువేల లోపు 14 మంది, ఐదువేల లోపు 37 మంది ర్యాంకులు సాధించినట్లు వివరిం చారు. అధ్యాపకులు ఉదరు, అన్వేష్‌లతో పాటు ర్యాంకులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను అభినం దించారు. సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.