Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఎంసెట్ ఫలితాలలో వెలాసిటీ విద్యార్థిని, విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో విజయకేతనం ఎగురవేశారు. సాధారణ విద్యా ర్థులు అసాధారణ ఫలితాలతో అద్భుతం సష్టించారు. ఇంజ నీరింగ్ విభాగంలో విద్యార్థిని విద్యార్థులు సాధించిన ర్యాంకుల వివరాలు. కె. శ్వేత (7326 ర్యాంక్), ఎం. శిరీష (8763 ర్యాంక్),ఎన్. ప్రియాంక (10430 ర్యాంక్), కె.మాధురి (12032 ర్యాంక్ ), ఎన్.కష్ణ కుమారి (14327 ర్యాంక్ ), ఏ. జగదీష్ (17323 ర్యాంక్), పి.రామకష్ణ (23201 ర్యాంక్), ఏ. సాయికుమార్ (19864 ర్యాంక్)లు ర్యాంకులు సాధించారు. ఈ విధంగా 50 వేలలోపు ర్యాంకులు సాధించినవారు 45 మందికి పైగా ఉన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ శెట్టి.లక్ష్మణరావు, కరస్పాండెంట్ ఎం.రవి, డైరెక్టర్ బి.వీరబాబు, అకడమిక్ డిన్ మహ్మద్ యాకుబ్ మరియు అధ్యాపక బృందం అభినందించారు.