Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
టీఎస్ఎంసెట్ ఫలితాలలో హార్వెస్ట్ కళాశాల విద్యార్థులు అధ్భుతమైన ఫలితాలను సాధించారని కరస్పాండెంట్ రవిమారుత్, ప్రిన్సిపల్ పార్వతీ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
67వ ర్యాంకుతో మేడూరి హర్షిత్ చౌదరి విజయ బావుటా ఎగురవేయగా 840వ ర్యాంకుతో ఎస్ కార్తిక్, 969వ ర్యాంకుతో బి విశాల్ మాథ్యూ, 1122 ర్యాంకుతో వి నిహంత్, 176వ ర్యాంకుతో యు గిరిధర్, 102వ ర్యాంకుతో విఎస్కెఎస్ఎస్ నారాయణ, 209వ ర్యాంకుతో టి ప్రణరు, 2313 ర్యాంకుతో హనుమత్ కృష్ణ విఘ్నేష్, 2534 ర్యాంకుతో ఆర్ సాయి కార్తికేయ అగ్రబాగాన నిలిచారని తెలిపారు. తమ కళాశాల నుంచి 130 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా రాష్ట్రస్థాయిలో 100 లోపు ర్యాంకు ఒకరు సాధించగా 1000 ర్యాంకు లోపు ముగ్గురు, 5000 లోపు 11 మంది, 10,000 లోపు 23 మంది, 25000 లోపు 45 మంది సాధించారని తెలిపారు.
అలాగే మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్షకు 23 మంది హాజరవగా రాష్ట్ర స్థాయిలో 398వ ర్యాంకు నిషత్ తరణరు, 1142వ ర్యాంక్ శ్లోక, 1908వ ర్యాంకు అనూచౌహాన్, 3452వ ర్యాంకు నటాషా సాధించినట్టు హార్వెస్ట్ కళాశాల యాజమాన్యం తెలిపింది. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.