Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశార్ధం తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎంసెట్ 2021 పోటీ పరీక్షలో నగరంలో న్యూ విజన్ జూనియర్ కళాశాల ర్యాంకులు ప్రభంజనాన్ని సృష్టించింది. రాష్ట్ర స్థాయిలో 49, 119, 233, 259, 426, 607, 634, 729, 804, 929, 976, 993, 1003, 1018, 1192, 1252, 1278, 1282, 1419, 1821 1815, 2022, 2064, 2096 వంటి మరెన్నో ఉత్తమ ర్యాంకులతో జిల్లా స్థాయిలోనే కాక రాష్ట్రస్థాయిలోనూ నెంబర్ వన్ కళాశాలగా న్యూ విజన్ నిల్చిందని కళాశాల చైర్మన్ శ్రీ సి.హెచ్.జి.కె. ప్రసాద్ తెలిపారు. నితిన్ -49. కె.లావణ్య - 119, అర్సియా ఫాతిమా -233, పి.త్రిశంక -259, యశస్విరత్న -426, పి.శ్రీ రామ్ -607, ఎస్.హర్షిత-634, పి. నిఖిల చంద్రక -729, టీ.అరవింద్ -804, సిఎచ్.కౌశిక్ 929, కె.సాయి విగేష్ 976, ఫహీరా -993, బి.సరస్వతి 1003, డి.కృష్ణకౌశల్ 1018, జి.సాహితి - 1192, మేఘనత్రెడ్డి 1252, బి.హారిక 1278, జీవీఎస్వి వరుణ్ సాకేత్ 1282, టీ.శివరామ కృష్ణ 1419, ఎం.ఓం తేజస్విని 1482, కె.సుమంత్ -1545, సీమ నాజనీన్ -1815, కె .అరవింద్ - 2022, కె. ఆర్యన్ - 2064, రూత్విక్ రోహన్ 2096 వ ర్యాంకులు సాధించారని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగం నుండి 280 మంది, అగ్రికల్చర్ నుండి 76 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 90% విద్యార్థులు సక్సెస్ రేట్ సాధించారని తెలిపారు. జెఈఈ మెయిన్స్ ఫలితాలలో 99.994252 ఉత్తమ పర్సెంటైల్తో ఆలిండియా మొదటి ర్యాంకును కైవసం చేసుకున్న న్యూవిజన్ అదే ఒరవడిని కొనసాగిస్తూ ఎంసెట్ 2021 ఫలితాలలో కూడా రాష్ట్రస్థాయి అత్యుత్తమ ర్యాంకులను పొందడం తాము అందిస్తున్న ఉత్తమ శిక్షణకు ప్రభల తార్కాణమని తెలిపారు. రాబోయే మెయిన్, నీట్, అడ్వాన్స్డ్ ఫలితాలలో కూడా తమ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధిస్తారనని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిమిత సంఖ్యగల విద్యార్థులతో న్యూ విజన్ కళాశాల విద్యార్థులు వారిదైనా ప్రతిభ చూపి మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను, అందుకు సహకరించిన తల్లిదండ్రులను న్యూ విజన్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ సి.హెచ్.జి.కె. ప్రసాద్, డైరెక్టర్ సి.హెచ్. గోపిచంద్ర అభినందించారు. కార్యక్రమంలో డీన్ మాధవరావు, ప్రిన్సిపాల్ బ్రహ్మచారి, శ్రీనివాసరావు మరియు అధ్యాపకబృందం పాల్గొని అభినందించారు.