Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మైనార్టీ జిల్లా అధ్యక్షులు యాకూబ్ పాషా
నవతెలంగాణ-పాల్వంచ
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కేంద్రం కొత్త గూడెం నుండి గతంలో నడిచిన ప్యాసింజర్ రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని మైనార్టీ జిల్లా అధ్యక్షులు యాకూబ్ పాషా బుధవారం నాడు రైల్వే అధికారులను కోరారు. కొత్తగూడెం జిల్లా కేంద్రం నుండి విజయవాడ ప్యాసింజర్ రైలు కొత్త గూడెం నుండి డోర్నకల్ కొత్త గూడెం నుండి సికింద్రాబాద్ వరకు కాకతీయ ప్యాసింజర్ రైలు, కొత్తగూడెం నుండి సిర్పూర్ కాగజ్ నగర్ ప్యాసింజర్ రైలు గతంలో ప్రతి రోజూ తిరిగేవనీ, కరోనా నేపధ్యంలో రైల్లంన్నింటినీ రద్దు చేయటం జరిగిందనీ.. దీని కారణంగా అనేకమంది పేదలు.. చిరు వ్యాపారులు.. విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా తగ్గుముఖం పట్టడంతో కొత్తగూడెం నుండి తిరిగే అన్ని రకాల ప్యాసింజర్ రైళ్లును పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా మణుగూరు నుండే సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలును గతంలో కొత్త గూడెం నుండి డోర్నకల్ వరకు వున్న అన్ని స్టేషన్లలో ఆగేదని, ప్రస్తుతం కేవలం ఒక కారేపల్లి స్టేషన్ నందు మాత్రమే ఆగుతూ.. డోర్నకల్ స్టేజీ లో ఆగటం లేదని... సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ ర్కెలు ను ఎక్స్ ప్రెస్ రైలు గా మార్పు చేసి పలు స్టేజీలను తొలగించటంతో పేదలకు భారంగా పరిణమించీంది. కొత్త గూడెం నుండి నడిచే అన్ని రకాల ప్యాసింజర్ రైళ్లను గతంలో మాదిరిగా యథావిధంగా కొనసాగించాలని, పెంచిన రైల్వే ఛార్జీలను తగ్గించాలని కోరారు. అందులో భాగంగా జిల్లా పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు, డివిజనల్ రైల్వే మేనేజర్ సికింద్రాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్లతో పాటు కొత్తగూడెం రైల్వే మేనేజర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హుస్సేన్ షకీల్ అంకుష్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.