Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ నాయకులు కేతినేని వేణు హెచ్చరిక
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
టిపిసిసి అధ్యక్షుడు, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి ఒక బజారు రౌడీలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, మళ్లీ పునరావృతం అయితే తగిన రీతిలో కాంగ్రెస్ శ్రేణులు బుద్దిచెప్పడం ఖాయమని కాంగ్రెస్ నాయకులు, తనగంపాడు సర్పంచ్ కేతినేని వేణు అన్నారు. మంత్రి మల్లారెడ్డి మాటలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. తప్పుడు మార్గంలో ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన మంత్రి చేసిన అక్రమాలు సక్రమం కావన్నారు. ఇప్పటికైనా మల్లారెడ్డి తన మాట తీరు మార్చుకోవాలన్నారు. లేనిపక్షంలో కాంగ్రేస్ కార్యకర్తలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.