Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
మండలం తల్లంపాడు గ్రామపంచాయతీలో పనిచేస్తున్న విష్ణు కుమారి పదవి విరమణ సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన సభలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్ళపల్లి మోహన్‌రావు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో పనిచేసే కార్మికులు జీవిత కాలం పని చేసిన గాని రాష్ట్ర ప్రభుత్వం నుండి పైసా కూడా పదవి విరమణ సందర్భంలో ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు పదవి విరమణ సందర్భంగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రమాద బీమా 50లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని, ప్రతి గ్రామపంచాయతీ వర్కర్‌కు సంవత్సరానికి రెండు జతల యూనిఫాం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సన్మాన సభకు గ్రామ పంచాయతీ వర్కర్ల యూనియన్ సీఐటీయూ రూరల్ మండల అధ్యక్షులు ఎస్.కె అజీజ్ పాషా, మండల నాయకులు పెద్ద పొంగు సైదులు, వాసం రాంబాబు, జిల్లేపల్లి రాములు, కొర్ని నాగరాజు, వంగర ధర్మేందర్, ఉపేందర్, దర్శి నాగేశ్వరరావు, చింతేటి వెంకన్న, వెంకట నరసమ్మ, పద్మ, లక్ష్మి, విజరు, మధు తదితరులు పాల్గొన్నారు.