Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కోట్ల నిధులు అభివృద్ధికి ఇచ్చిన సింగరేణి
అ వర్కర్స్ యూనియన్ నేతల వెంకట్
నవతెంగాణ-కొత్తగూడెం
కోల్ సిటీగా పేరొందిన కొత్తగూడెం పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులలో సింగరేణి ప్రతిష్టను చాటే విధంగా చిహ్నాలు ఏర్పాటు చేసి తగిన గుర్తింపు ఇవ్వాలని, మున్సిపల్ పరిధిలో రూ.కోట్ల నిధులు ఇచ్చిందని, నల్లనేల...చీకటి సూర్యుల చరిత్రను విస్మరించడం సరికాదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి వంగా వెంకట్ కోరారు. స్థానిక శేషగిరిభవన్లో గురువారం జరిగిన యూనియన్ ముఖ్య నాయకుల సమావేశంలో వెంకట్ మాట్లాడారు. జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెం పట్టణాన్ని సుందరీకరిస్తున్న మున్సిపల్ శాఖ పట్టణానికి తలమానికంగా ఉన్న సింగరేణి సంస్థకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్ అంబేద్కర్ సర్కిల్ ఫౌంటెన్లో సింగరేణి ప్రాముఖ్యతను చాటే విధంగా సింగరేణి చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ లేకుంటే ఇక్కడ అభివృద్దే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ, కమీషనర్ సంపత్కుమార్కు యూనియన్ ఆద్వర్యంలో వినతి పత్రం సమర్పించినట్లు వెంకట్ తెలిపారు. సంబందిత సింగరేణి అధికారులను సంప్రదించి చిహ్నం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, వర్కర్స్ యూనియన్ కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శి గనిగళ్ళ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.