Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల నిర్యించిన పల్లె ప్రకృతి వనంకి చుట్టు నిర్మించిన గోడ కూలింది. బుధవారం అర్ధరాత్రి గోడ కూలింది. రాత్రికురిసిన భారి వర్షానికి ప్రకృతి వనంలో నింపిన మొర తడిసి కాంపౌడ్ వాల్ కూలింది. సుమారు 50 మీటర్ల మేర పేకమేడలా కూలిపోయింది. రాత్రి పూట కావడంలో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
వాల్ వార్...మొదలు
చాతకొండ పంచాయతీ పరిధిలోని డ్రైవర్స్ కాలనీ గుట్టపై నిర్మించిన ప్రకృతి వనం ప్రహరి గోడ నాసిరకంగా కట్టడం వలన గోడ మూడునాళ్ళ ముచ్చటైందని చాతకొండ పంచాయతీ వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. నిర్మాణం మొదటి నుంచి చెప్పునట్టిగానే నాసిరకం పనులు నడుస్తున్న సమయంలో మెట్లు కూలాయని, పంచాయతీ రాజ్ వ్యవస్థ పర్యవెక్షణ లేకుండా డ్రైవర్స్ కాలనీ వద్ద ఉన్న గుట్టకు పక్కన గోడ నిర్మించి నప్పుడు కాంక్రీటు వాల్ కట్టాల్సి ఉంది కానీ, సర్పంచ్ వారి కొంత మంది స్వార్దం కోసం నాసిరకం బ్రిక్స్, నాసిరకం సిమెంట్‌తో నిర్మాణం చేశారని ఆరోపిస్తున్నారు. పంచాయతీ సొమ్ము సుమారు రూ.20 లక్షల వరకు ప్రకృతి వనానికి కేటాయించారని, ఇప్పడు ప్రహరి కూలి భారీ నష్టం జరిగిందని వాపోయారు. ఈ విషయమై పంచాయతీ పాలకవర్గం తీర్మానం లేకుండానే బిల్లుల చెల్లింపులు చేశారని ఆరోపించారు. ఈ అవివీతిపై గతంలో కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినట్లు, విచారణ అధికారిగా మండల ఎంపీడీఓ వార్డు సభ్యులు వాంగ్మూలాన్ని రికార్డు చేశారని గుర్తుచేశారు. ఈ పల్లె ప్రకృతి వనంపై ప్రశ్నించినందుకు ఒకవార్డు సభ్యుడు పై భౌతిక దాడి జరిగిందని బాధితుడు శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికైన అధికారులు కళ్ళు తెరిచి పల్లె ప్రకృతి వనంపై సమగ్ర విచారణ జరిపించాలని వార్డు సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఉద్దేశపూర్వకంగ కూల్చారు..సర్పంచ్ బాదవత్ అనూష
చాతకొండ గ్రామ పంచాయతీ పల్లెప్రకృతి వనం సపోర్ట్ గోడను గుర్తితెలియని దుండగులు బుధవారం అర్ధరాత్రి ఉద్దేశపూర్వకంగా కూల్చారని చాతకొండ సర్పంచ్ బాదవత్ అనూష విలేకర్లకు తెలిపారు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వాపోయారు. గతంలో పల్లె ప్రకృతి వనం గురించి తప్పుడు ఆరోపణలు చేసి జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని వల్ల ఎటువంటి ప్రభావం లేకపోవడంతో, ఇలాంటి పనులకు పాల్పడ్డారు. పంచాయతీలో అభివృద్ధి పనులు గిట్టని వారు ఎన్నో ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తులు పల్లెప్రకృతి వనం గోడ కూల్చి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తంచేశారు. లక్ష్మీదేవిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.