Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పిల్లల విషయంలో అశ్రద్ధ వహిస్తే
చర్యలు తప్పవు
అ కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండలంలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత జిల్లా పరిషత్ పాఠశాలలతో పాటు కళాశాలలు పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. గురువారం ఆయన మండలంలో ఆకస్మిక పర్యటన చేశారు. తొలుత మండల పరిధిలోని మోరంపల్లిబంజర పంచాయతీలోని జింకలగూడెం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి తహశీల్దార్ భగవాన్‌రెడ్డి, ఎంపీడీవో వివేక్ రామ్, సర్పంచ్ దివ్యశ్రీ, ప్రభుత్వ ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలను పునఃప్రారంభిం చాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీచేసిందని, ఈ క్రమంలో పాఠశాలలకు వచ్చే విద్యార్థుల పట్ల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అశ్రద్ధ చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులు పాఠశాలలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చూడాలన్నారు. పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో తరగతి గదులను, పరిసరాలను శుభ్రం చేయించి శానిటైజింగ్ చేయించాలని సూచించారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలుంటే వారిని గుర్తించి సరైన వైద్యం అందించాలని, పాఠశాలల నిర్వహణ విషయంలో ప్రధానోపాధ్యాయులు అంకితభావంతో ఉండాలన ా్నరు. అనంతరం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి రికార్డులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తహశీల్దార్ కార్యాలయం నిర్వహణ బాగుందని, కార్యాలయంలో మరికొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిందిగా తహశీల్దారు సూచించారు.