Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మద్యాన్ని నియంత్రించాలి
అ ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ
నవతెలంగాణ- నేలకొండపల్లి
మండలంలోని ముఠాపురం గ్రామంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన ఘటనపై ఐద్వా ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీగా ముఠాపురం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. జరిగిన ఘటనపై గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో మైనర్ బాలికను తల్లిదండ్రులు వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్లారని గ్రామస్తులు తెలపడంతో తిరిగి అక్కడ నుండి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్ లో ఎస్సై అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న నిందితుడు బానోతు దీప్లాను జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న అసమర్థ విధానాల వలన ఇటువంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై, ప్రత్యేకంగా మైనర్ బాలికలపై దాడులు, అత్యాచారాలు హత్యలు వంటి అనర్ధాలు జరగడానికి మద్యం అనేది అత్యంత కీలకంగా ప్రభావం చూపిస్తుంది అన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో మద్యం దుకాణాల ఏర్పాటుకు అవకాశం కల్పించి మద్యాన్ని ఏరులై పారించడంతో మందుకు బానిసలైన అనేకమంది ఇటువంటి నేరాలకు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారన్నారు. గ్రామాలలో మద్యానికి అలవాటు పడిన వారు నైతిక విలువలను, మానవత్వాన్ని మరచి పైశాచికత్వంతో మైనర్ బాలికలపై అఘాయి త్యాలకు పాల్పడుతున్నారన్నారు. ఇటువ ంటి ఘటనలకు పాల్పడటానికి ప్రధాన కారణమైన మద్యాన్ని ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను ముఖ్యంగా మహిళలను, యువతను చైతన్యవంతం చేయాలన్నారు. ఐద్వా జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గ వీటి సరళ మాట్లాడుతూ సమాజంలో మహిళలపై ప్రత్యేకంగా మైనర్ బాలికలపై లైంగిక దాడులు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలలో మద్యాన్ని పెంచి పోషించడమే అన్నారు. మద్యానికి బానిస కావడం చేతే నిందితున్ని కట్టుకున్న భార్య, కన్న పిల్లలు సైతం దూరం చేశారన్నారు. ఈ నేపథ్యంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లి దగ్గరే ఉంటూ మద్యానికి మరింత దగ్గరై మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తుందన్నారు. ఇటువంటి అఘాయిత్యాల ప్రధాన కారణమైన మద్యాన్ని ప్రభుత్వం నియంత్రించాలి అన్నారు. లైంగిక దాడికి గురైన మైనర్ బాలికలకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఖర్చులను ప్రభుత్వమే భరించి ఉపాధి కల్పించాలన్నారు. లైంగిక దాడికి పాల్పడినట్లు మెడికల్ రిపోర్ట్ ద్వారా నిజమైతే దోషిని కఠినంగా శిక్షించి మరో ఘటన పునరా వతంం కాకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ, మండల కార్యదర్శి బెల్లం లక్ష్మి పాల్గొన్నారు.