Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్ : మథర్ థెరిస్సా జయంతి సందర్భంగా న్యూ లైఫ్ థియో లాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ వారు మండల పరిధిలోని సీపీఎంకు చెందిన ఆళ్లపాడు సర్పంచ్ మర్రి తిరుపతి రావుకి గురువారం హైదరాబాదులో న్యూ లైఫ్ థియో లాజికల్ యూనివర్సిటీ అధికారులు కీర్తి పురస్కారం అవార్డును అందజేశారు. అంకితభావంతో పనిచేస్తూ, క్షేత్ర స్థాయిలోఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని కీర్తి పురస్కారం అవార్డుకి ఎంపిక చేస్తారు. సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత గ్రామాభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సర్పంచ్ పదవిని మర్రి తిరుపతిరావు నిర్వహించారు. దీంతో మర్రి తిరపతి రావుకి ఈ పురస్కారం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా అందజేసే కీర్తి పురస్కార్ అవార్డ్ 2021 సంవత్సరంనకు గాను బోనకల్ మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామానికి చెందిన మర్రి తిరుపతిరావును ఎంపిక చేయడం జరిగింది.ఈ పురస్కారాన్ని గురువారం సంస్థ ఫౌండర్, ఛైర్మెన్ బిషప్. రేవ్.డాక్టర్.జోసెఫ్ పాళంజి చేతుల మీదుగా మర్రి తిరుపతిరావుకి అందజేశారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమిడియన్ రాజమౌళి పాల్గొన్నారు. తిరుపతిరావుకి కీర్తి పురస్కారం అవార్డు రావడం పట్ల సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు, ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి, తాసిల్దార్ రావూరి రాధిక, ఆళ్లపాడు ఎంపిటిసి పారా శ్రీదేవి, మాజీ సర్పంచులు పారా లక్ష్మీనారాయణ, పార ఉమ గ్రామ పంచాయతీ కార్యదర్శి జొన్నలగడ్డ పరశురాములు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. బహుమతి ప్రదానోత్సవం పట్ల మండలంలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, రాజకీయ నాయకులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు తిరుపతి రావు కు శుభాకాంక్షలు తెలియజేశారు.