Authorization
Mon Jan 19, 2015 06:51 pm
4 15.37 ఎకరాల భూమిని 40 యేండ్లుగా
సాగు చేస్తున్న గిరిజనులు
4 ఆదివాసీలను భూములకు దూరం చేసే
కుట్రలో భాగమే ఉద్యాన వనాలు
4 మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ
సభ్యులు మిడియం బాబురావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా ఉద్యాన వనాల పేరుతో గిరిజనులు యేండ్లు తరబడి సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా గుంజుకునే దాష్టీకానికి ఒడి గడుతోంది..మాకు ఆ భూములే జీవనాధారం అని గిరిజనులు నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకుంటున్న మీకేం హక్కులు ఉన్నాయంటూ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల సహకారంతో సాగు భూముల్లో ఉద్యాన వనాలను ఏర్పాటుకు అడ్డు లేకుండా గిరిజనులను భయాందోళనకు గురి చేస్తున్నారు. మండలంలోని రామచంద్రాపురం గ్రామం పూర్తి ఆదివాసీ గ్రామం. గ్రామంలో సుమారు 73 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. రెవిన్యూ గ్రామంగా ఉన్న రామచంద్రాపురం గిరిజనులు వ్యవశాయం పై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. గ్రామం మొత్తంగా 20 ఎకరాలకు మాత్రమే గిరిజన రైతులు సొంత భూములకు పట్టాలు కలిగి ఉన్నారు. భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ గత 20 ఏండ్ల క్రితం గ్రామంలో సర్వే చేయించి ప్రభుత్వ భూము లను తమకు అప్పగిం చారని రామచంద్రా పురం గిరిజనులు ఆరోపిసు ్తన్నారు. కాగా సర్వే నెం 32/3 లో 15.37 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన 15 మంది గిరిజన రైతులు 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 15 మంది గిరిజన రైతుల్లో 13 మందికి ఒక్క సెంటు భూమి కూడా లేని పరిస్థితి. మిగతా ఇద్దరు రైతులకు చెరో అర ఎకరం మాత్రమే సొంత భూమి కలిగి ఉన్నారు. ఆ భూమిపై అధికారులు కన్ను వేశారు. మెగా ఉద్యాన వనం పార్కు కోసం ఆ భూమిని ఎంపిక చేశారు. ఆ భూముల్లో మెగా పార్కు ఏర్పాటు కోసం రెవిన్యూ అధికారులు గత నెల 5వ తేదీన గ్రామ సభ నిర్వహించినట్లు చెబుతున్నారని ఇది ముమ్మాటికి అబద్దం అని వెంటనే బహిరంగంగా గ్రామ సభ నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
భూములకు దూరం చేసే కుట్ర :
మాజీ ఎంపీ మిడియం బాబురావు
ఆదివాసీలను భూముల నుండి దూరం చేసే కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మెగా ఉద్యాన వనాల పేరుతో గిరిజనులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న సాగు భూములను బలవరతంగా గుంజుకునే కుట్ర చేస్తోంది. రామచంద్రాపురం గిరిజనులు జీవనాధారంగా సాగు చేసుకుంటున్న సాగు భూముల్లో మెగా పార్కు నిర్మించే ఆలోచనను అధికారులు విరమించుకోవాలి.