Authorization
Mon Jan 19, 2015 06:51 pm
4 పలువురికి గాయాలు
4 నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-ఇల్లందు
మండలంలోని సుభాష్ నగర్‌కు చెందిన స్వరూపరాణి (42) సిద్దిపేటలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మిగతా కుటుంబ సభ్యులు స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. డాక్టర్ రమేష్ భార్య స్వరూపరాణితో కలిసి కుటుంబంలో ఐదుగురు శనివారం ఇల్లందు నుండి హైదరాబాద్ బయలుదేరారు. అక్కడ పనులు ముగించుకొని గురువారం వేములవాడకు బయల్దేరారు. మార్గం మధ్యలో సిద్దిపేట వద్ద కారు డివైడర్‌ను ఢకొీట్టింది. ఈ ఘటనలో డాక్టర్ రమేష్ భార్య స్వరూపరాణికి తీవ్రగాయాలయ్యాయి. కొద్దిసేపటికి మృతి చెందింది. మిగతా కుటుంబ సభ్యులు స్వల్పంగా గాయాలతో బయటపడ్డారు. మృతదేహాన్ని ఇల్లందుకు తరలించారు. సుభాష్ నగర్ సర్పంచ్ వల్లాల మంగమ్మ నరసింహారావు, ఎంపీటీసీ శ్రీలంక ఉమ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు యలమద్ది రవి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.