Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐదుగురు అరెస్టు
అ గంజాయి విలువ రూ.14 లక్షల 60వేలు
అ ఏఎస్పీ జి.వినీత్
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో వివిధ గంజాయి కేసులలో 73 కేజీల గంజాయిని భద్రాచలం పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటనలో ఐదుగురును అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏయస్పీ జి.వినీత్ వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.14 లక్షల 60 వేలు వుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల25న పాత కూరగాయల మార్కెట్ వద్ద ఎస్సై మధు ప్రసాద్ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఒక టాటా ఇండికా కార్ ఏపీ 24 ఏసీ 1341 నందు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఒక వాహనాన్ని ఆపి, తనిఖీ చేయగా ప్రభుత్వం నిషేధించిన గంజాయి 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ కొట్యా తండాకు చెందిన తేజావత్ రంగన్న సీలేరు నుండి హైదరాబాద్కు గంజాయిని రవాణా చేస్తున్నాడు. గంజాయి విలువ సుమారు రూ.8 లక్షలు వుంటుందని పోలీసులు తెలిపారు. అదేవిధంగా గురువారం ఆర్టీసీ బస్టాండ్లో ఎస్ఐ మధు ప్రసాద్, పోలీసు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులు తమ లగేజ్ బ్యాగ్లతో అనుమానాస్పదంగా కనిపించటంతో వారి బ్యాగులు తనిఖీ చేయగా నిషేధిత 33 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా విజరు బాపు రావు రూక్ డే, రాజమతి విజరు బాపురావు రుక్ డే, సంజరు కాశీనాథ్ ముండాలిక్లు వీరందరూ మహారాష్ట్రలోని పర్బనీ జిల్లాకు చెందినవారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ముగ్గురి వద్ద స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.6 లక్షల 60 వేలు వుంటుందని వెల్లడించారు. ఈ గంజాయిని దారకొండ నుండి మహారాష్ట్రకు తీసుకెళ్తున్నారని తెలిపారు. అదేవిధంగా పాత గంజాయి కేసులో ఉన్న మరొక ముద్దాయి కొత్తగూడెంకు చెందిన సమద్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ తనిఖీల్లో నలుగురు వద్ద కలిసి 73 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.14 లక్షల 60 వేల వుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఏయస్పీ డాక్టర్ జి.వినీత్ మాట్లాడుతూ పట్టణ సరిహద్దులలో 24 గంటలు పోలీస్ తనిఖీలు జరుగుతుంటాయని పేర్కొన్నారు. నిషేదిత వస్తువులు అయిన గంజాయి, మరే యితర వస్తువులని తరలించిన వారిపై చట్టరీత్య చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ టి.స్వామి, పట్టణ ఎస్ఐ యస్.మధు ప్రసాద్, పియస్ ఐ రంజిత్ సిబ్బంది పాల్గొన్నారు.