Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీఎమ్ఎఫ్, హడ్కో నిధులతో సీసీ రహదారులు, సైడ్
డ్రైనేజీలు, ప్రహరీలు
అ ప్రదాన రహదారి వెంబడి ఎల్ఈడీ, హైమాక్స్ లైటింగ్ సిస్టం
అ నేడు 1 కోటి 76 లక్షల అభివృద్ధి పనులను
ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని నర్సాపురం గ్రామ పంచాయతీ రూపు రేఖలు మారనున్నాయి. నర్సాపురం గ్రామ పంచాయతీని మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చి దిద్దుతానని పల్లె ప్రగతి వేదిక ద్వారా మాట ఇచ్చిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దీంతో నర్సాపురం పంచాయతీ మోడల్ గ్రామ పంచాయతీగా రూపుదిద్దు కోనుంది అనే చెప్పవచ్చు.
మండల పరిధిలోని నర్సాపురం గ్రామ పంచాయతీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గ్రామానికి చెందిన ఎంతో మంది ఉన్నత చదువులు చదివి దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నప్పటికి ఊరు అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అమ్మమ్మ వాళ్ల ఊరు కూడా నర్సాపురం గ్రామం కావడం విశేషం. అమ్మమ్మ ఊరికి ఏదో చేయాలనే తపనతో డీఎమ్ఎఫ్ ద్వారా రూ.1 కోటి 6 లక్షల 90 వేల నిధులు, ప్రపంచ బ్యాంకు హడ్కో ద్వారా రూ.70 లక్షల మంజూరు చేయించారు. మంత్రి అజరు 2020 జనవరి 6వ తేదీన రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నరాపురం గ్రామంలో సర్పంచ్ వర్సా శివరామకృష్ణ అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆ సమయంలో తాను ఆడి పాడిన తన అమమ్మ ఊరును రాష్ట్రంలో మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చి దిద్దుతానని సభా వేదిక ద్వారా మాట ఇవ్వడంతో పాటు రూ.కోటి నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పుడు సభా వేదికపై ఉన్న కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, అనంతరం కలెక్టర్గా భాద్యతలు తీసుకున్న ఎంవి.రెడ్డిని సైతం నిధులు సత్వరమే మంజూరు చేయాలని మండలంలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన సమయంలో గుర్తు చేశారు.
చేపట్టబోయే అభివృద్ధి పనులు:
వెంకట్రామాపురం రోడ్డు నుండి పాత దంతెనం డంపింగ్ షెడ్డు వరకు 600 మీ సీసీ రోడ్డు, వెంకట్రామాపురం, చెలక దంతెనంలో సైడ్ డ్రేనీజీ నిర్మాణం, కొత్త మారేడుబాక ఊరు చివరి నుండి మొట్లవాగు వరకు 600 మీ సీసీ రహదారి, కొత్త మారేడుబాకలో 50 మీటర్ల అంతర్గత సీసీ రహదారులు మూడు, పాత దళిత వాడ నుండి పడమటి చెరువు వరకు 500 మీ సీసీ రోడ్డుతో పాటు సూదిరెడ్డి క్రిష్ణవేణి ఇంటి దగ్గర నుండి ఎమ్ఐ ట్యాంకు వరకు సిసి రహదారి నిర్మాణం, కొత్త మారేడు బాకలో కుంజా వీరయ్య ఇంటి వద్ద నుండి సున్నం వీరయ్య, పడమటి చెరువు నుండి నర్సాపురం వరకు సీసీ రహదారి నిర్మాణాల వంటి పలు సీసీ రహదారులు, సైడ్ డ్రేజేనీ నిర్మాణాలు, ఎంపీపీ, అంగన్వాడీ పాఠశాలలకు ప్రహరీ గోడల వంటి పలు పనులు చేపట్టనున్నారు.
ఎల్ఈడీ హైమాక్స్ సిస్టం
హడ్కో నిధులతో నర్సాపురం ప్రధాన రహదారి వెంబడి సుమారు రూ.13 లక్షల 50 వేలతో ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు పలు ప్రదాన కూడళ్లల్లో హైమాక్స్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయనున్నారు. రూ.1 కోటి 76 లక్షలతో చేపట్టబోయే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి నేడు నర్సాపురం గ్రామానికి మంత్రి పువ్వాడ అజరు కుమార్ వస్తున్న సందర్భంగా అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.
మంత్రి దృష్టికి పలు సమస్యలు : వర్సా శివరామకృష్ణ (సర్పంచ్) నర్సాపురం
మోడల్ గ్రామ పంచాయతీగా రూపు దిద్దుకుంటున్న నర్సాపురం అభివృద్ధి కోసం పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకు పోనున్నట్లు నర్సాపురం సర్పంచ్ వర్సా శివరామకృష్ణ నవతెంగాణకు తెలిపారు. నర్సాపురం వైద్యశాలను 24 గంటల వైద్యశాలగా అప్గ్రైడ్ చేసి వైద్య సిబ్బంది స్థానికంగా ఉండేందుకు కోటర్స్ నిర్మించాలని, కొత్త పంచాయతీ భవన నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు, కొత్త మారేడుబాక మొట్ల వాగుపై బ్రిడ్జి ఏర్పాటుకు నిధులు తదితర సమస్యలు మంత్రి దృష్టికి తీసుకు వెళ్లి వాటిని మంజూరు చేయించేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు.