Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
మండలంలో సాగర్ఆయకట్టు, పాలేరు రిజర్వాయర్ చుట్టూ వున్న గ్రామాల్లో రైతులంతా పూర్తిగా వరి పంటపైనే ఆధారపడి ఉన్నారని, గతేడాది ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవడం వల్ల సొసైటీ, ఐకెపి నిర్వహకులు, మిల్లర్లు కలిసి రైతులను నిలువునా దోపిడీ చేశారని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బారి మల్సూర్ అన్నారు. పాలేరులో పార్టీ గ్రామశాఖ మహాసభ నందిగామ నాగిరెడ్డి అధ్యక్షతన జరిగింది. శాఖకార్యదర్శిగా పందిరి వీరారెడ్డిని శాఖ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మల్సూర్ మాట్లాడుతూ... గత సంవత్సరం మండలంలో ధాన్యం కొనుగోలు లో, బస్తాలు, పట్టాల పేరుతో నిర్వహించిన వ్యాపార లావాదేవీలలోఅవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతుల నుండి ఒక్కో బస్తాకు 5కేజీల నుండి 15కేజీల వరకు తరుగు తీయడం, రైతు దగ్గర లారీ కిరాయి పేరుతో రూ.1000 నుండి రూ.3000ల రూపాయల వరకు డబ్బు వసూలు చేసి ఇష్టారాజ్యంగా సొసైటీ, ఐకెపి ఉద్యోగులు అవకతవకలకు పాల్పడ్డారన్నారు. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ సంవత్సరం ధాన్యం కొనుగోళ్లపై ముందే స్పష్టతనివ్వాలన్నారు. సభలో పార్టీ నాయకులు యడవల్లి రమణారెడ్డి, గొపె వినరు, కందులబాబు, నిమ్మలవెంకన్న, శీలం వీరేష్, చంద్రం, వెలిశెట్టి రంగన్న, రేగొట్టి వెంకన్న, గోపె రామకృష్ణ, అనంతుల వీరన్న, శీలం వెంకన్న, శీలంశ్రీను, గోపె వీరభద్రం, యడవల్లి వీరభద్రారెడ్డి, విజరురెడ్డి తదితరులు పాల్గొన్నారు.