Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జెడ్పీటీసీ తిరుపతి కిషోర్
అ పలువురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ నిధులు
నవతెలంగాణ-చింతకాని
రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉన్ననాడే రాష్ట్రం సుబిక్షంగా ఉంటుందనేది సీఎం కేసిఆర్ ్ ముఖ్య ఉద్ధేశ్యమని, అందులో భాగంగా ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం నాంధి పలుకుతుందని చింతకాని జడ్పీటీసీ పర్చగాని తిరుపతి కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం చిన్నమండవ గ్రామంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు కృషితో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ సిఫా రసు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇరువురు భాధితులకు ఆయన అంద జేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ కిషోర్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే వారికి చికిత్స ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, కొందరు అప్పులు చేసి శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న తరుణంలో పేద కుటుంబాల వారు అప్పులు దొరక్క ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి భారీ ఖర్చుతో కూడిన శస్త్ర చికిత్సకు ముందస్తు నిధుల మంజూరు వలన వేలాది మంది ఆరోగ్యవంతులు గా మారుతున్నా రన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాశిమాల వెంకట్రావమ్మ,ఉపసర్పంచ్ పర్చగాని వీరబాబు, నాగులవంచ సొపైటీ డైరక్టర్ పర్చగాని లక్ష్మణ్ పాల్గొన్నారు.