Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
ఎర్రా శ్రీకాంత్
నవతెలంగాణ-గాంధీచౌక్
దేశంలో రోజురోజుకు తీవ్రంగా పెరుగుతున్న అసమానతలను సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వాలు ఎప్పటికీ రూపుమాపలేవని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ పేర్కొన్నారు. పార్టీ 48వ డివిజన్ మహాసభలు యడ్లపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన సారథి నగర్లో జరిగాయి. ఈ మహసభలు ప్రారంభిస్తూ శ్రీకాంత్ మాట్లాడాతూ వివిధ పేర్లతో ఆర్భాటంగా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఉద్దరిస్తున్నట్లు, సమస్యలు పరిష్కారం చేస్తున్నట్లు గొప్పలు పోవడం పరిపాటిగా మారిందన్నారు. కానీ ఈ పథకాలు ప్రజా సమస్యలకు కంటి తూడుపు చర్యలు తప్ప శాశ్వత పరిష్కారం చూపలేవన్నారు. దేశ, రాష్ట్ర బడ్జెట్ లలో ప్రతి సంవత్సరం అంకెల మార్పు కాదు కావల్సిందని, పెట్టిన బడ్జెట్లో జనాభా తో భాగిస్తే వచ్చిందే నిజమైన వాటా అని, దేశ సంపద ప్రజల సమిష్టి కృషి అని దీనిలో సమానత్వం కోసం కొట్లాడమనేదే మార్క్సిజం అని పేర్కొన్నారు. ఈ దిశగా పోరాటాలు నడపడమే కమ్యూనిస్టులుగా మన పని అని పిలుపు నిచ్చారు. మహసభలలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, త్రీటౌన్ కార్యదర్శి తుశాకుల లింగయ్య, నాయకులు బండారు యాకయ్య, డివిజన్ కార్యదర్శి శీలం వీరబాబు, డివిజన్ నాయకులు పి.పుల్లారావు, పి.రామకృష్ణ, కన్నెగంటి సుజాత, శాబాదు రమణ, మిడకంటి శ్రీనివాసరెడ్డి, రిలయన్స్ నరసింహరావు, పోలుదాసు సురేష్, కందుల శ్రీధర్, గోసుల వెంకన్న, పి.బాలాజీ, వెగ్గలం వెంకటేశ్వర రావు, యస్ నరేష్, రాజేష్, కృష్ణకుమారి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.