Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఫ్రలించిన ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎంఎల్ఏ రాములునాయక్ కృషి
అ మణుగూరు ఎక్స్‌ప్రెస్‌కు రిటన్ హాల్టింగ్ ఇవ్వాలి
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి రైల్వే స్టేషన్లో సింగరేణి ఎక్స్‌ప్రెస్ నిలుపుదలకు ఎట్టకేలకు రెండోసారి ఉత్తర్వులు ఇచ్చారు. గత నెల 7వ తేదిన ఉత్తర్వులు ఇచ్చి వెనుకకు తీసుకున్న దక్షిణమధ్య రైల్వే అధికారుల తీరుపై కారేపల్లి ప్రాంత ప్రజలల్లో అగ్రహావేశాలు వెల్లడైంది. ఈస్ధితిలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ చొరవ తీసుకొని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు దృష్టికి తీసుకవెళ్లారు. దీంతో ఎంపీ దక్షిణ రైల్వే అధికారులకు లేఖ రాయటంతో పాటు రైల్వే ఉన్నతాధికారులను సంప్రందించారు. ఎట్టకేలకు భద్రాచలం రోడ్ నుండి సిర్పూర్నగర్ వెళ్ళు సింగరేణి ఎక్స్‌ప్రెస్ (07260/07259) ను 28 తేది నుండి కారేపల్లి, గార్ల, ఒదెల రైల్వే స్టేషన్లలో నిలుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై కారేపల్లి ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మణుగూరు ఎక్స్‌ప్రెస్ ఆపాలి
మణుగూర్-సికింద్రాబాద్ వెళ్లు మణుగూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ను సికింద్రబాద్ వెళ్ళి టప్పుడు నిలుదల ఇచ్చి, సికింద్రాబాద్ నుండి తిరుగుప్రయాణం కారేపల్లి రైల్వే స్టేషన్లో నిలుపుదల చేయటం లేదని దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని సామాజిక కార్యకర్త ఇందుర్తి సురేందర్‌రెడ్డి కోరారు. ఏజన్సీ ప్రాంత ప్రజలు రైళ్ల పైనే ఎక్కువ అధారపడతారని తిరుగుప్రయాణంలో మణుగూరు ఎక్స్‌ప్రెస్ హల్టింగ్ లేక పోవటం వలన ఈప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. మణుగూరు ప్యాసింజర్ పోచారం, కారేపల్లి, గాంధీనగర్, చీమలపాడు, తడికలపుడి బేతంపుడి స్టేషన్లలో నిలుపుదల చేయాలని రైల్వే అధికారులను కోరారు. దీనికి ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు.