Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
అత్యవసర చికిత్స కోసం ఇక నుంచి దూర ప్రాంతాలకు వెళ్లకుండా కాంపోనెంట్స్, ఐఫెరీసెస్ సౌకర్యాలతో పట్టణ ప్రజలకు సేవా వాలంటరీ బ్లడ్ బ్యాంకును పట్టణ ప్రజలకు నిర్వాహకులు చీపు గంగాధర్, షేక్ అబ్దుల్లా తీసుకొచ్చారు. పాత పంచాయతీ కార్యాలయం పక్క వీధిలో ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ బ్యాంకును స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ అనంతరం బ్లడ్ బ్యాంకును పరిశీలించారు. నగరాలకు ధీటుగా పట్టణ ప్రజలకు పలు రకాల సౌకర్యాలతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయడంపై నిర్వాహకులను ఎమ్మెల్యే సండ్ర అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గంగాధర్, అబ్దుల్లా మాట్లాడుతూ తమ బ్లడ్ బ్యాంకులో ఫ్రెష్ ఫ్రొజెన్ ప్లాస్మా, ప్లేట్లెట్స్, వాష్డ్ రెడ్ బ్లడ్ సెల్, ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా, కోవిడ్ కన్వర్షన్ ప్లిస్మా, ప్లాస్మా థెరఫీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దొడ్డా శంకరరావు, బ్లడ్ బ్యాంకు డాక్టర్లు పి.రాజేశ్, కె.జోత్న్స పాల్గొన్నారు.