Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రమాదాలపై 17వ ఏరియా లెవెల్
ట్రైపాట్రైట్ సేఫ్టీ రివ్యూ మీటింగ్
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో రక్షణ చర్యలపై కార్మికుల్లో మరింత చైతన్యంపెంచేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, ప్రణాళికాబద్దంగా సాంకేతిక నైపుణ్యం పెంచాలని 17వ ట్రైపార్టీస్ రివ్యూమీటింగ్లో డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ రీజియన్ ఆఫీసర్స్ సింగరేణి యాజమాన్యానికి సూచించారు. శుక్రవారం కొత్తగూడెంఏరియాలోని సీఈఆర్ క్లబ్లో 17వ ఏరియా లెవెల్ ట్రైపాట్రైట్ సేఫ్టీరివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెకర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ హైరరాబాద్ రీజియన్స-1 శ్యామ్ మిశ్రా, డైరెకర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ హైరరాబాద్ రీజియన్స-1 ఎలట్రరకీల్ అధికారి టి.శ్రీనివాస్ మాట్లాడారు. 16 వ ఏరియా లెవెల్ ట్రైపాట్రైట్ సేఫ్టీ రివ్యూ మీటింగ్లో సూచించిన అంశాలపై చర్చించారు. యాక్షన్స టేకెన్స్ రిపోర్ను ఏరియా సేఫ్టీ ఆఫీసర్ బివిఎస్. శర్మ వివరించారు. ఇటీవల సింగరేణి మణుగూరులో జరిగిన ప్రమాదం గురించి వివరణ తీసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి 2నిముషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో డిడిఎంఎస్ బాలసుబ్రహ్మాణ్యం, ఎం.రఘు, వి.రంగరావు, సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్, ఏరియా జిఎం సిహెచ్.నర్సింహారావు, జిఎం సేఫ్టీ అధికారులు కె.గురువయ్య,్టతదితరులు పాల్గొన్నారు.