Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ప్రభుత్వం ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటో తారీకు నుండి విద్యాసంస్థలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇల్లందు పట్టణంలో ఉన్న అన్ని పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ కాలేజీలు ఇల్లందు మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. శుక్రవారం విద్యాసంస్థలలో జరుగుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పరిశీలించారు. కార్యక్రమంలో చైర్మన్ వెంట ఒకటో వార్డు కౌన్సిలర్ వార రవి, జవాన్ ప్రకాష్, ప్రిన్సిపాల్లు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.