Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య
నవతెలంగాణ - వైరా టౌన్
సెప్టెంబర్ 5వ తేదీన వైరా పట్టణంలో జరుగబోయే తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ఖమ్మం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని శుక్రవారం జరిగిన గొర్రెలు, మేకల పెంపకం దారుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మ రోశయ్య పిలుపునిచ్చారు. గొర్రెలు, మేకల పెంపకం దారుల సంక్షేమం కోసం, ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరకు అనేక పోరాటాలను సంఘం నిర్వహిస్తున్నదని అన్నారు. ప్రభుత్వ పథకాలను గొర్రెల కాపరులకు అందే విధంగా సంఘం పని చేయాలని సూచించారు. అనంతరం గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చింతలచెరువు కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బారి మల్సోర్, మేకల నాగేశ్వరరావులు మాట్లాడుతూ గొర్రెల కాపర్లను ఆర్థికంగా, సామాజికంగా రాజకీయంగా అభివద్ధి పరిచేందుకు మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని, జిల్లా మహాసభలలో చర్చించి పోరాటాల రూపకల్పన చేస్తామని అన్నారు. మహాసభలలో గొర్రెలు, మేకల పెంపకం దారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు గుమ్మా నరసింహారావు, కంపసాటి శివ, కూరాకుల నాగరాజు ఇమ్మడి గోపాలరావు, రాచబంటి బత్తిరన్న పాల్గొన్నారు.