Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గిరిజన జూనియర్ కళాశాల
డిగ్రీ కళాశాలగా అప్ గ్రేడ్‌కు చర్యలు
అ విద్యాశాఖ అధికారుల
సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే
నవతెలంగాణ-ఇల్లందు
నియోజకవర్గంలో రెండు కోట్ల రూ.సీడీపీ నిధులతో గురుకుల పాఠశాలల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విద్యాశాఖ అధికారుల సమీక్షా సమావేశంలో ఆమె తెలిపారు. ఇల్లందు నియోజకవర్గంలో భవనాలు, సరైన వసతి సౌకర్యాలు లేక ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల గురుకులాలను నిర్వహించేందుకు అవసరమైన భవన నిర్మాణాలకు సంబంధించి 30 ఎకారాల స్థలాలను ప్రభుత్వం కేటాయించినట్టు తెలిపారు. నూతన భవన నిర్మాణాల ప్రహరీ కోసం రూ.2 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. బీసీ బాలికల గురుకులానికి బొడులో, బీసీ బాలుర గురుకులానికి టేకులపల్లిలో, మైనార్టీ గురుకులానికి ఇల్లందు రేపల్లె వాడలో, ఎస్సీ గురుకులా నికి ఇల్లందు ఆర్అండ్ఆర్ కాలనీలో, అదేవిధంగ ట్రైన్ ఫైట్ ఫర్ రెసిడెన్సి యల్గా కొనసాగుతున్న సుదిమల్ల జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకుం టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బానోతు హరి సింగ్ నాయక్, తహసీల్దార్ కృష్ణవేణి, బీసీ వెల్ఫేర్ డీసీఓ డిసీజ్ కృష్ణవేణి, స్పెషల్ ఆఫీసర్ జయరాజ్, సంజీవ రావు, సోషల్ వెల్ఫేర్ ఏఆర్సి కుర్షిద్ పాషా, వివిధ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.