Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ లక్షల ఖర్చుచేసినా దక్కని ప్రాణాలు
అ అడ్రస్ లేని ఎమ్మెల్యేలు, ఎంపీలు
అ 29న వంద పడకల ఆసుపత్రి
మట్టడి : ఆఖిలపక్షం
నవతెలంగాణ-మణుగూరు
పినపాక నియోజకవర్గంలోని ఆదివాసీ గ్రామాల్లో డెంగ్యూ, విషజ్వరాల వలన మరణాలు రోజు రోజకు పెరుగుతున్నాయని ఆఖిల పక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో సీపీఐ(ఎం), సీపీఐ, తెలుగుదేశం, సీపీఐ ఎంఎల్లు సంబంధించిన నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014లో నిర్మించిన మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో యేడేండ్ల నుండి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు. వైద్యం అందక ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు. మండలంలో ఆర్ఎంపీ డాక్టర్ నుండి ఎంఎస్ డాక్టర్ వరకు సాధారణ జ్వరంతో వచ్చిన వారికి డెంగ్యూ వున్నదని వైద్యం నిర్వహిస్తున్నారు. జిల్లా వైధ్యాధికారులు వివరాలు ప్రకారం మణుగూరు డెంగ్యూ టెస్ట్ సెంటర్ లేకపోయిన ఎలా డెంగ్యూ టెస్టులు నిర్వహి స్తున్నారని ప్రశ్నించారు. జ్వరం వచ్చిన రెండో, మూడు రోజుల లోపే జ్వరపీడుతులు కోమలోకి పోతున్నారన్నారు. భయందోళనకు గురైన బాధిత కుటుంబసభ్యుల లక్షలు ఖర్చు చేసిన ప్రాణం దక్కడం లేదన్నారు. వెంటనే వంద పడకల ఆసు పత్రిణి పూర్తి ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్ది అన్ని రకాల సౌకర్యాలు, వైద్యనిపుణులు నియమించా లన్నారు. కలెక్టర్, జిల్లా వైద్యాధికారులను వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆఖిలపక్ష నాయకులు బి.అయోధ్యచారి, టివిఎంవి ప్రసాద్, ఉప్పతల నర్సింహారావు, వాసురెడ్డి చలపతిరావు, ఆర్.మధు సూదన్రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.