Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
మిడియం బాబురావు
నవతెలంగాణ-చర్ల
ఏకలవ్య పాఠశాలను చర్లలోనే ప్రభుత్వ భూమిలో నిర్మించాలని, ఆదివాసీలకిచ్చిన అసైన్డ్ మెంట్ పట్టాభూÛమిని ఆదివాసీలనే సాగుచేసుకొనివ్వాలి, మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మీడియం బాబురావు అన్నారు. చర్ల మండల కేంద్రంలో విజయకాలని ఆదివాసీలు పట్టాభూముల సాధన కోసం జరుగుతున్న పోరాట కేంద్రానికి మీడియం బాబురావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొండా చరణ్ అధ్యక్షతన జరిగిన ఆదివాసీ పోడు సాగు దారుల సమావేశంలో బాబురావు మాట్లాడారు. లబ్దిదారులైన 29 మంది ఆదివాసీలతో ఈ సమస్యపై చర్చించారు. రెవెన్యూ వారు ఇచ్చిన సర్వేనంబర్లు రద్దుచేయ్యడం, 53 సర్వే నంబర్లు లేకుండా చేయడం దుర్మార్గమని అన్నారు. గత దశాబ్ద కాలంగా సాగులో ఉన్న ఈ ఆదివాసీలు ప్రభుత్వం నేడు రైతు బంధు కూడా ఇస్తుందని అన్నారు. ఈ భూమిని ఆడివాసీలది కాదు అని సర్వే నంబర్ వీరిని రెవెన్యూ వారు చెప్పడం అసంబద్ధంగా, అన్యాయంగా ఉందని అన్నారు. నిజంగానే ప్రభుత్వం ఈ పట్టా భూములనే తీసుకొని పాఠశాల నిర్మాణం చెయ్యాలంటే ఒక్కో ఆదివాసీలకు 1 హెక్టార్ భూమిని పట్టా ఇచ్చి ఇవ్వాలని అన్నారు. భూమిని ముందు ఇవ్వకుండా పాఠశాలని ఈ ఆదివాశీల భూమిలో నిర్మిస్తే ఆదివాసీలు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. చర్లకు మంజూరు అయిన ఏకలవ్య పాఠశాలను చర్లలోనే ప్రభుత్వ భూమిలో నిర్మించాలని అన్నారు. చర్లలో అనేక చోట్ల ప్రభుత్వ భూము లు అందుబాటులో వున్నాయి. అందుకు ఉదాహరగా నాయకుల కాలనీలో 12 ఎకరాల భూమిని పల్లె ప్రకృతి వనం కోసం కేవలం 4 రోజుల్లోనే యుద్ధప్రాతిపదికన కేటాయించడం జరిగిందని అన్నారు. ఏకలవ్య పాఠశాల మంజూరు అయి ఇన్ని రోజులు అవుతున్నా రెవెన్యూవారు ఎందుకు పాఠశాలకు భూమిని కేటాయించలేదని నిలదీశారు. ఏకలవ్య పాఠశాలను చర్లలోనే ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని లేకుంటే ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొల్లా వినోద్, మచ్ఛా రామారావు, బందెలా చంటి, సమ్మక్క, వరలక్ష్మీ, సురమ్మ, నాగమని, ఆదెమ్మ, సతిష్ తదితరులు పాల్గొన్నారు.