Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
లేబర్ కోడ్లు, వ్యవసాయ చట్టాలు, విద్యుత్ చట్టం సవరణ బిల్లు రద్దు కోసం సెప్టెంబర్ 25న భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.సాయిబాబు పిలుపు నిచ్చారు. రైతు సంఘాల సంయుక్త కార్యచరణ కమిటి ఇచ్చిన భారత్ బంద్‌కి సీఐటీయూ, సంపూర్ణ మద్ధతు తెలియజేస్తుంద న్నారు. బంద్ జయప్రదానికి ఆగష్టు 28నుండి సెప్టెంబర్ 24 వరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృత ప్రచారం చేయాలని సీఐటీయూ కార్యకర్తలకు సూచించారు. 9 నెలల నుండి ఢిల్లీ కేంద్రంగా పోరాడుతున్న రైతుల ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయకుండా బలప్రయోగం ద్వారా అనిచి వేయాలని చూస్తుందని విమర్శించారు. ప్రభుత్వం ఎన్నిరకాలుగా దాడులు, నిర్భందం ప్రయోగించినా రైతులు పట్టుదలతో చేస్తున్న ఉద్యమం మొత్తం దేశానికి స్పూర్తిగా వుందని అన్నారు. లేబర్ కోడ్లు, వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ల కోసం తెచ్చారు తప్పదేశం కోసం, ప్రజల కోసం కాదని అన్నారు. 6లక్షల కోట్లు కార్పొరేట్లకు పన్నురాయితీలు ఇచ్చి అ భారాన్ని సామాన్య ప్రజలపైన వేస్తుందని అందుకు పెట్రోల్, డిజిల్, గ్యాస్ రేట్లు అడ్డగోలుగా పెంచి లక్షల కోట్లు దోపిడి చేస్తుందని ఆరోపించారు. కార్పొరేట్ల లాభాలకోసం దేశప్రజల సంపద మొత్తాన్ని అమ్మేస్తుందని విమర్శించారు. 6 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వరంగాన్ని రోడ్లు, విద్యుత్, గ్యాస్ పైపులైన్లు కూడా సంతలో సరుకుల్లా అమ్ముతున్నారని సీఐటీయూ విమర్శించింది. అంబానీ, అదానీ వంటి బడాబాబుల కోసం దేశాన్ని అమ్ముతున్న బీజేపీ విధానాలను ప్రజలు, కార్మిక వర్గం ఐక్య ఉద్యమాల ద్వారా ప్రతిఘ టించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఆర్ధిక అసమానతలు తీవ్రమవుతున్నాయని, కార్మికవర్గం, సామాన్య పేదల కోనుగోలు శక్తి గణనీయంగా పడిపోయిందని సీఐటీయూ పెర్కొన్నది. ప్రజల కొనుగోలు శక్తి పెంచటంకోసం నగదువ బదిలీ చేయాలని, కార్మికులకు కనీసవేతనం 21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలనను ప్రతిఘటించటం కోసం గ్రామీణ స్ధాయిలో రైతు, వ్యవసాయ కార్మిక, ఇత ప్రజాసంఘాలతో కలిసి పనిచేయాలని భారత్ బంద్ రోజు అన్ని మండల కేంద్రాలలో వేలాది మంది కార్మికులు, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి పాలన వ్యవస్ధను స్ధంబింపచేయాలని పిలుపు నిచ్చారు. యంవి.అప్పారావు, అధ్యక్షతన జరిగిన సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎజె రమేష్, కోశాధికారి జి.పద్మ, జిల్లా ఆఫీస్ బేరర్స్, కె.బ్రహ్మాచారి, కొండపల్లి శ్రీదర్, వెంకటమ్మ, పిట్టల అర్జున్, గద్దల శ్రీను, యర్రగాని కృష్ణయ్య, నాయకులు పాయం రాధకుమారి, చిలకమ్మ, కిరణ్, సుగుణ, సుశీల, నర్సింహావు, రాములు, గోపాల్ రావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.